Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అతిథి అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం

అతిథి అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్  
పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ చంద్రిక  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్ (2), కంప్యూటర్ సైన్స్ (1), ఫిజికల్ డైరెక్టర్ (1) పోస్టుల కోసం మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. సంబంధిత పీజీలో 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. నెట్, సెట్, పి హెచ్ డి , బోధన అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కలదు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను తీసుకొని 1/07/2026 నుండి 5/07/2026 దాస్ నగర్ నిజామాబాద్ డిగ్రీ కళాశాలలో  మరియు ఆర్మూర్ కళాశాలలో సమర్పించాలి. డెమో: తేదీ 07/07/2026 న ఇంటర్వ్యూ, డెమో ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -