సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్
నవతెలంగాణ-మద్నూర్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తెలిపారు. మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘంలో కొనసాగుతున్న వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండవ రోజు చైర్మన్ ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు పరిపత్తి సంఘం అధికారులు సిబ్బంది కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం వాటిని పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మేనూర్ హెచ్కెల్లూర్ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరస్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాం పటేల్, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు అనుమంతు యాదవ్, పరిపత్తి సంఘం సెక్రెటరీ గంగాధర్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



