Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి 

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

కుట్టు మిషన్ల పంపిణీ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ

మహిళలు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, స్వయం ఉపాధి పొందాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని న్యాక్ భవనంలో కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు.

మైనార్టీ శాఖ ప్రత్యేకంగా శిక్షణ అందించి కుట్టు మిషన్లు అందించడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కుట్టు మిషన్ లకు సంబంధించి పీఎం విశ్వకర్మ పథకం అందుబాటులోకి తీసుకువచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో 500 కుట్టు మిషన్ల ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశ వేణు, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మఠం పవన్, పంచరెడ్డి అనిత సురేష్, ప్రీతి ప్రవీణ్, పవన్ ముందడ, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -