రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
రాష్ట్రంలో ఎరువులకు సంబంధించి కేంద్రం బాధ్యత వహించాలని, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం 10ఏండ్లలో రూ.73వేల కోట్లు ఇచ్చిందని, తాము 2025లో 9 రోజుల్లోనే వాటిని వేశామన్నారు. రైతులకు సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నామని, అదేవిధంగా రైతులకు పనిముట్లు కూడా అందిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు, విత్తనాల సరఫరా, విద్యుత్‌లో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నామన్నారు. ప్రతి రైతు వేదిక దగ్గర యూరియాపై ఏఈఓలు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. బీజేపీ.. బీహార్, బెంగాల్‌లో వారి వ్యతిరేక ఓట్లు తొలగించిందని, కాబట్టి మన రాష్ట్రంలో జరిగే సర్ ప్రక్రియలో బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మెన్ కేడం లింగమూర్తి, మార్కెట్ వైస్ చైర్మెన్ బంక చందు తదితరులు పాల్గొన్నారు.
‘సర్’ ప్రక్రియ పరిశీలన..
హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డులో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్ కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. ఇంటింటికి నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులు, చిరునామా సవరణ వంటి అంశాల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఎరువులపై కేంద్రం బాధ్యత వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



