నవతెలంగాణ-జన్నారం
కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొని వచ్చిన వికసిత్ భారత్ జి రామ్ జి అనే స్కీంను తీసుకొని వచ్చి, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం గా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని 40 శాతం నిధులు కోత పెట్టి రాష్ట్రాలపై భారం మోపినారు. రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం ఖర్చు చేసే పరిస్థితుల్లో లేవు. దీనిని కేంద్ర ప్రభుత్వం పాత పద్ధతి ప్రకారం మొత్తం నిధులను ఇచ్చి పాత పద్ధతి ప్రకారం కొనసాగించాలని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శ కనికారం అశోక్ జన్నారం వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మగ్గిడి జయ అన్నారు.
బుధవారం మండలంలోని పొనకల్ గ్రామ,సుందరయ్య నగర్ లో వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్న చిన్న కారు రైతులు దళిత గిరిజన కుటుంబాల నోటికాడి కూడును లాగేసుకొని తీవ్రమైన అన్యాయం చేయ ప్రయత్నిస్తున్నారని వారన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి.దానిని స్కీముగా మార్చే ఆలోచన కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తీర్మానించినారు.
ఈ కార్యక్రమంలో సుందరయ్య నగర్ ఉపాధిహామీ కార్మిక సంఘం నాయకులు సిరివేని కలవ్వ అధ్యక్షులు, ఎగ్గే ప్రమీల, ఫాతిమా బేగం ఉపాధ్యక్షులు, కోడి జుట్టు మమత కార్యదర్శి, జాడి లక్ష్మి సహాయ కార్యదర్శి ఉపాధి హామీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.



