Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ డిమాండ్ చేశారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల నమోదు పెంపుపై చర్చించారు.

ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నప్పటికీ, ఇంకా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని పాఠశాలల్లో కనీసం కూర్చునేందుకు బెంచీలు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరతను అధిగమించాలని, విద్యార్థులకు కావాల్సిన వసతులను వెంటనే కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు పవన్ కుమార్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -