నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో సంవత్సరాల నుంచి ప్రజలను ప్రయాణికులను, వ్యాపారస్తులను కోతులు ఇబ్బందుల గురి చేస్తున్న పరిస్థితుల నుండి ఎట్టకేలకు మున్సిపల్ పారకవర్గం చర్యలకి శ్రీకారం చుట్టింది. కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గత నాలుగు రోజుల నుండి కోతులని పట్టే వారితో కోతులను పట్టించి , వాటిని అటవీ ప్రదేశంలో విడిచి పెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు ఇబ్బందులు తొలగించడానికి మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కృషి చేశారు.
ఈ సందర్భంగా ప్రయాణికులు, పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియమ్మ మార్కు, యాట శివ,పస్తం ఆంజనేయులు, జూకంటి సంపత్,మల్లెల సరిత శ్రీకాంత్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కె.సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


