నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం కొనసాగుతుంది. గత నెల 25న ప్రారంభమైన సర్ సర్వేలో భాగంగా ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ చురుగ్గా సాగుతుంది. తక్కువ ఓటర్ బూత్ ల్లో, గ్రామాల్లో ఇప్పటికే ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ బూత్ లెవల్ అధికారులు పూర్తి చేశారు. అత్యధిక ఓటర్లు ఉన్న బూతులకు సంబంధించి ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ కొనసాగుతోంది. బూత్ లెవెల్ అధికారులు, బూత్ సాయి ఏజెంట్లు ఇంటింటికి తిరుగుతూ ఎన్యుమరేషన్ పత్రాలను పంపిణీ చేస్తున్నారు. పంపిణీ సందర్భంగా పత్రాలను తప్పులు లేకుండా, సమగ్ర వివరాలతో పూర్తి చేసి తిరిగి అందించాలని సూచిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో మండలంలో ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
మండలంలో కొనసాగుతున్న సర్ సర్వే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



