జిల్లా వైద్యాధికారిని డాక్టర్ రాజశ్రీ
నవతెలంగాణ-బాల్కొండ
వైద్య వృత్తిలో హరికుమార్ గౌడ్ సేవలు మరువలేనివని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రాజశ్రీ అన్నారు. కిసాన్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న సుధా బోయిన హరి కుమార్ గౌడ్ పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో బుధవారం పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిని డాక్టర్ రాజశ్రీ పాల్గొని మాట్లాడుతూ వైద్య వృత్తిలో హరికుమార్ గౌడ్ 36 సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ఎందరికో సేవలను అందించాలని అతని సేవలు మరువలేని అని హరికుమార్ గౌడ్ సేవలను ప్రశంసించారు. అనంతరం డాక్టర్స్ డే పురస్కరించుకొని డాక్టర్ స్రవంతి, డాక్టర్ యశ్వంత్ డాక్టర్ కీర్తన లను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఇమ్యూనికేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్, నిర్మల్ ఆర్ ఎం ఓ డాక్టర్ రమేష్,ఐఎన్టియుసి డిస్టిక్ ప్రెసిడెంట్ నటరాజ్, ఆర్మూర్ సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి, వైద్యులు డాక్టర్ ప్రణవ, డాక్టర్ పల్లవి, డాక్టర్ రాకేష్, వివిధ జిల్లాల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వైద్య వృత్తిలో హరికుమార్ గౌడ్ సేవలు మరువలేని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



