Thursday, July 2, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీ, యూపీలో జాతీయ ర‌హ‌దారుల‌కు రూ.14,115 కోట్లు

ఢిల్లీ, యూపీలో జాతీయ ర‌హ‌దారుల‌కు రూ.14,115 కోట్లు

- Advertisement -

కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ, యూపీల్లో రూ.14,115 కోట్ల వ్యయంతో జాతీయ రహదారులు అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. బుధ‌వారం నాడిక్క‌డ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రూ.7,145.14 కోట్ల‌తో కాన్పూర్ నుంచి క‌బ్రాయ్ వ‌ర‌కు మొత్తం 117.7 కిలో మీట‌ర్ల మేర నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ ర‌హ‌దారిని నిర్మించ‌నున్నారు. ఈ ప్రాజెక్టును, ఎన్‌హెచ్‌-34లోని ప్రస్తుత కాన్పూర్-కబ్రాయ్ విభాగానికి సంబంధించిన నిర్వహణ, పర్యవేక్షణతో పాటు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఎఐ) సంస్థ బివోటి (టోల్) పద్ధతిలో అమలు చేస్తుంది. ఢిల్లీలో ఆరులైన్ల ద్వార‌కా ఎక్స్‌ప్రెస్ హైవే (ఎన్‌హెచ్ 248 బిబి) నెల్స‌న్ మండేలా మార్గ్, వసంత్ కుంజ్ క‌నెక్టివిటి కోసం ట‌న్న‌ల్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 8.1 కిలో మీట‌ర్లు నిర్మించ‌నున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.6,989.67 కోట్ల‌ను ఖ‌ర్చు చేయ‌నుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -