మధ్యవర్తుల ద్వారా
అధికారుల స్థాయిలో సంప్రదింపులు
ఎంఓయూ అమలు,
ఆస్తుల విడుదలే ప్రధాన ఎజెండా
దోహా : అమెరికా, ఇరాన్ అధికారులు బుధవారం ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా అధికారుల స్థాయిలో పరోక్ష చర్చలు జరిపారు. ఈ చర్చలలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ భాగస్వాములు కాలేదు. వీరిద్దరూ మంగళవారం నాడు ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్-థానీతో సమావేశమై పరోక్ష చర్చలకు పునాది వేశారు. అటు ఇరాన్ అధికరులు కూడా ఖతార్ మధ్య వర్తులను కలిశారు. అమెరి కాతో కుదుర్చుకున్న ఎంఓయూ అమలు, విదేశాలలో అమెరికా స్తంభింప జేసిన ఆస్తుల విడుదల గురించి తమ అధికారులు చర్చిం చారని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై చెప్పా రు. రాబోయే రోజులలో అమెరికా ప్రతినిధులను కలిసే ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. స్తంభింపజేసిన ఆరు బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను ఇంకా బదిలీ చేయలేదని అంటూ చర్చలలో పురోగతిని బట్టి ఆ పని జరుగుతుందని చెప్పారు.
చర్చలపై ఖతార్ ఏమంది?
అమెరికా నేతలతో జరిగిన సమావేశం తాజా పరిణామాలను సమీక్షిం చిందని ఖతార్ విదేశాంగ శాఖ తెలిపింది. ‘అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఎంఓయూ అమలు కోసం జరుగుతున్న చర్చలు ఎలా సాగుతున్నాయనే దానిపై సమీక్ష జరిగింది. చర్చలు, దౌత్యం ద్వారా మధ్యప్రాచ్యంలో భద్రతను, సుస్థిర తను బలోపేతం చేసేందుకు చేపట్టా ల్సిన చర్యలపై కూడా చర్చించారు. అని వివరించింది. లెబనాన్‌లో కాల్పుల విరమణ అమలు జరుగు తున్న తీరును కూడా ఈ సమా వేశం సమీక్షిం చింది. లెబనాన్ ఐక్యత, సార్వ భౌమత్వం, సుస్థిరత లను పరిరక్షిం చాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. కాగా ఇరాన్, అమెరికా మధ్య సాంకేతిక చర్చలు కొనసాగు తాయని, అయితే ప్రస్తుతానికి ఇరు పక్షాల మధ్య ఉన్నత స్థాయిలో సంప్రదింపులు ఏవీ జరగబోవని ఖతార్ చెప్పింది.
కీలక అంశాలపై కానరాని పురోగతి
రెండు వారాల క్రితం అమెరి కాతో కుదుర్చుకున్న కా ల్పుల విరమణ ఒప్పందం అమలు కు సంబంధించిన నియమ నిబంధ నలను ముందుగా రూపొందిం చుకోవాల్సి ఉన్నదని, ఆ తర్వాతే కీలక అంశాలపై చర్చ జరుగుతుం దని ఇరాన్ అధికారులు తెలిపారు. కాగా ఎంఓయూలోని కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య నెలకొన్న దూరం అలాగే ఉన్నదని తాజా పరిణామాలు సూచిస్తు న్నాయి. ఎంఓయూ ప్రకారం… అమెరికా అందించే ఆర్థిక ప్రోత్సా హకాలకు బదులుగా హార్ముజ్ జల సంధిపై పట్టును ఇరాన్ సడలిం చాల్సి ఉంటుంది. అలాగే శాశ్వత శాంతి ఒప్పందం కోసం 60 రోజుల పాటు సంప్రదింపులు జరపాలి. అయితే ఈ పనులేవీ ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు.



