Thursday, July 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఇంటిగ్రేట్‌ చేయండి

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఇంటిగ్రేట్‌ చేయండి

- Advertisement -

అనలాగ్‌, మెగా కంపెనీల అధినేతలకు సీఎం సలహా
నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఇంటిగ్రేట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని తీసుకురావాలన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేలా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌‌ (ఏఐ)కు అనుసంధానించాలని చెప్పారు. నీటి లీకేజీలను ముందుగానే గుర్తించి మరమ్మతులు చేపట్టడం, అవసరానికి అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు మార్గం సుగమం చేయడం వంటి కాగ్నిటివ్ సిటీస్ రూపకల్పనకు ఉన్న విస్తృత అవకాశాలను పరిశీలించాలని కోరారు. అనలాగ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మాన్, మెగా ఇంజనీరింగ్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ఎమ్‌డీ పీ కృష్ణారెడ్డి బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్‌‌సీహెచ్చార్డీ)లోని బోధి పెవిలియన్‌లో సీఎం రేవంత్‌‌రెడ్డితో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కే రామకృష్ణారావు, ఇన్వెస్ట్ సీఈఓ, హైదరాబాద్ మెట్రోరైల్ అదనపు ఎమ్‌డీ బీ అజిత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అనలాగ్, మెగా సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిపై చర్చిచారు. హైదరాబాద్ ట్రాఫిక్ పై పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన పనుల వివరాలను వారు సమావేశంలో వివరించారు. సమస్యలు, వాటికి సత్వర పరిష్కారం, దానికోసం వినియోగించే సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించారు. సిటీలో అత్యాధునిక ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్స్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. సెన్సర్లు, రోబోటిక్స్, ఫిజికల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా సురక్షితమైన, సమర్థవంతమైన, వేగంగా స్పందించే పట్టణ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి అవసరమైన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇరు సంస్థలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన సమక్షంలో అనలాగ్, ఎంఈఐఎల్ సంయుక్త భాగస్వామ్యంతో అవగాహన ఒప్పందం కుదిరింది. పరస్పరం సాంకేతిక సహకారం, నూతన ఆవిష్కరణల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ ఒప్పందాలు జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -