- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో శనివారం రాత్రి దోమల నివారణ కు సర్పంచ్ శ్రావణి గంగాశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో ని ఆయా కాలనీల్లో ఫాగింగ్ తో దోమల నివారణ చర్యలు చేపట్టారు. దోమలు ఉన్న ప్రాంతంను గుర్తించి నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నివారణకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. పారిశుధ్యం లోపం తలెత్తకుండా గ్రామస్తులు కూడా ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
- Advertisement -



