Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి

వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి

- Advertisement -

– రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశనాయక్
– ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ – బల్మూరు 

వీబీజీ రాంజీ చట్టం రద్దు చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మాత్రమే అమలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశా నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రం బల్మూరు మండల పరిషత్ కార్యాలయం ముందు గురువారం ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా అంబేద్కర్ కూడలి వద్ద నిరసన తెలియజేసి ర్యాలీగా బయలుదేరి బల్మూరు మండల కేంద్రంలో గ్రామీణ ఉపాధి హామీ పని చేసే కూలీలచే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జులై 1 నుండి విబిజి రాంజీ చట్టాన్ని అమలు చేయాలని దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిందని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పోరాడి వాము పక్షాలు మద్దతు సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి విబిజి రాంజీ చట్టాన్ని తేవడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. 125 రోజుల పని దినాలను ప్రచారం చేస్తున్నారు కానీ నిధులు కేటాయింపు బాధ్యతనుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తుందని వారు ఆరోపించారు. గతంలో 90% నిధులు కేంద్రమే ఇచ్చేది దానిలో 40% కోత పెట్టి 60% మాత్రమే ఇస్తారట నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది దుర్మార్గం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. వ్యవసాయ పనుల సీజన్లో 60 రోజులు పని బంద్ చేయాలని కొత్త చట్టంలో ఉన్నదని కనీస వేతనాల గురించి కొత్త చట్టంలో పేర్కొనలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రాంజీ చట్టం యొక్క ఉద్దేశం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీని నిర్వీర్యం చేయాలనే కుట్ర దాగి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని కూలీలు అందరు కూడా ఆలోచించి ఉద్యమాలు పోరాటాలు చేయకపోతే భవిష్యత్తులో ఉపాధి హామీ లేకుండా పోతుందని వారు అన్నారు ఉదయము సాయంత్రం పని ప్రదేశంలో ఫోటోలు అప్లోడ్ చేయాలి ఫోటోలు అప్లోడ్ అయితేనే ఆన్లైన్లో వేతనాలు వస్తాయి లేకపోతే రావని వారు అన్నారు పని గ్రామపంచాయతీ ఎంపిక చేసే అవకాశం దీనిలో లేదని గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వమే ఎప్పుడు ఎవరికీ ఎక్కడ పని పెట్టాలి అనేది నిర్ణయిస్తుందని ఈ చట్టంలో ఉందని వారు అన్నారు. మెట్లు ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలు కొత్త చట్టం అమలు అయితే కొనసాగే అవకాశం ఉండదని వారు అన్నారు. ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. కూలీలు పని హక్కును హరించే కొత్త చట్టాన్ని మన గ్రామంలో లేదా మండలాల్లో అమలు చేయకూడదని అధికారులను వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కోసం క్షేత్రస్థాయిలో పిలుపు ఇవ్వాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి శంకర్ నాయక్ వ్యవసాయ కార్మిక సంఘం మెట్ల సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలు వెంకట్రావు గోపాల్, సీపీఐ(ఎం) నాయకులు ఎండి లాల్ మహమ్మద్ కృష్ణయ్య బాలీశ్వరయ్య సీపీఐ(ఎం) వార్డ్ మెంబర్లు గౌరీ బాలరాజు నాయకులు స్వామి పాండు శంకర్ బాలు దేవేందర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రాధాకృష్ణ ఉపాధి హామీ కూలీలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -