Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ సర్పంచ్ కూమారుడి వివాహ ఏర్పాటులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

మాజీ సర్పంచ్ కూమారుడి వివాహ ఏర్పాటులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని డోన్ గావ్ జిపి మాజీ  సర్పంచ్ గజీరే కళావతి బలరామ్ కుమారుడు గజిరే రాజు వివాహ కార్యక్రమ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తన స్వగ్రామమైన డోన్గావ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్  దగ్గరి బంధువులు అని తెలిపారు. అందులో భాగంగా చిన్ననాటి నుండి తాను వారి కుటుంబము కలుపుగోలుగా ఉంటూ చిన్ననాటి జ్ఞాపకాలను మర్చిపోకడా తనతో పార్టీకి బలోపేతంగా ఏర్పాటు చేయడానికి తనవంతుగా కృషి చేస్తూ ఎన్ని కష్టనష్టాలు వచ్చినా పార్టీని వీడకుండా ఉన్న కార్యకర్తగా గుర్తింపు ఉంది. గ్రామ అనుబంధం ఎంతో బలిష్టంగా ఉంటుందని ని మర్చిపోలేని అనుభూతులు ఉన్నాయని అన్నారు. స్వయంగా తాని దగ్గరుండి అన్ని పనులు చేయించి వివాహ కార్యక్రమం బుధవారం జుక్కల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరుగుతుందని కుటుంబ సమేతంగా వివాహ కార్యక్రమానికి హాజరు అవుతామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తో పాటు గ్రామానికి చెందిన పలువురు బీఅర్ఎస్ పార్టీ గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -