నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలో గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఎంపిడిఓ శ్రీనివాస్ , ఈజీఎస్ ఈసీ స్వామి దాస్ పరీశీలించడం జరిగిందని గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ చారీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలను త్వరిత గతిన చేపట్టాలని గ్రామస్తులకు, లబ్ధిదారులకు సూచించారు. నిర్మాణాలు పూర్తీ చేసుకున్న లబ్ధిదారులకు మూడు విడతలుగా డబ్బులు మంజూరు అయిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని తెలిపారు. నిర్మాణాలు పూర్తీ చేసుకున్న వారు గృహ ప్రవేశం కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపారు. నిబంధనల ప్రకారం కరెక్ట్ గా నిర్మాణాలు చేపడుతున్న వారికి మాత్రమే డబ్బులు చెల్లించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ , గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, ఈసీ స్వామి దాస్, జిపి కార్యదర్శి రమేష్ చారి, ఫీల్డ్ అసిస్టెంట్ ఎ.సుభాష్, పడంపల్లి వాగ్మారే సంజు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



