Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాణ్యమైన భోజనం అందించాలి: ఎంఈఓ

నాణ్యమైన భోజనం అందించాలి: ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, పౌష్టికాహారం, పరిశుభ్రతను పరిశీలించేందుకు మండల విద్యాధికారి చందర్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయమైన భోజనం మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతున్నదా అనే విషయాన్ని పరిశీలించారు. వంటగది నిర్వహణ, స్టోర్‌రూమ్ నిర్వహణ, వంట ఏజెన్సీ పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

విద్యార్థులకు అందిస్తున్న అన్నం, పప్పు, కూరలు, గుడ్లు తదితర ఆహార పదార్థాలు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా, రుచికరంగా, వేడిగా ఉన్నాయా అని విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాల, వంట పాత్రలు, పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే బియ్యం నిల్వలు, ఇతర సరుకుల స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి నిర్వహణపై సూచనలు చేశారు. ఈ తనిఖీలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -