Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గంగాపూర్ లో రైతులకు విత్తనోత్పత్తిపై అవగాహన

గంగాపూర్ లో రైతులకు విత్తనోత్పత్తిపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-చిన్నకోడూరు 
రైతులకు నాణ్యమైన వరి విత్తనాలను అందించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాబార్డ్ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా 93 సహకార సంఘాలను ఎంపిక చేశాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, జగదేవపూర్, గంగాపూర్ సంఘాలు ఎంపికయ్యాయి. ఇందులో భాగంగా గురువారం గంగాపూర్ సహకార సంఘంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (సిద్దిపేట) ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా   జిల్లా కోపరేటివ్ అదికారి వరలక్ష్మి మాట్లాడుతూ ప్రైవేటు సంస్థల హవాను నియంత్రించి, పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవడానికి రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేయాలని, నాణ్యమైన ఫౌండేషన్ విత్తనాలతో 10-15% దిగుబడి పెరుగుతుందన్నారు.జిల్లాలోని విత్తనోత్పత్తి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు తగిన సలహాలు, సూచనలు అందించడం జరుగుతుందన్నారు.

 జిల్లా వ్యవసాయ అధికారిణి స్వరూప రాణి మాట్లాడుతూ  ఈ ప్రతిష్టాత్మక పైలట్ ప్రాజెక్టును సిద్దిపేట జిల్లా ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, రైతులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్,శాస్త్రవేత్త డాక్టర్ జి. సంతోష్ కుమార్,తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పల్లవి, గంగాపూర్ వ్యవసాయ విస్తరణ అధికారి శివ,బ్యాంకు ప్రతినిధులు పరశురాములు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -