Thursday, July 2, 2026
E-PAPER
Homeఖమ్మంరెండు రోజుల్లో నాలుగు ఎకరాలకు రైతు భరోసా

రెండు రోజుల్లో నాలుగు ఎకరాలకు రైతు భరోసా

- Advertisement -

– నియోజకవర్గంలో 33,758 మంది రైతులకు లబ్ధి
నవతెలంగాణ – అశ్వారావుపేట

వానాకాలం – 2026 సీజన్‌ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలను వేగవంతం చేసింది. జూన్ 30న ప్రారంభమైన రైతు భరోసా పంపిణీ ప్రక్రియలో భాగంగా, కేవలం రెండు రోజుల్లోనే నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో మొత్తం 33,758 మంది రైతులకు రూ.36.52 కోట్లు రైతు భరోసా కింద వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. దీంతో నాలుగు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులు ఈ విడతలో లబ్ధి పొందారు.

వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న తరుణంలో రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ కావడంతో విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం మిగిలిన అర్హులైన రైతుల ఖాతాల్లో కూడా దశలవారీగా రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు సమాచారం. అశ్వారావుపేట నియోజకవర్గంలో రైతు భరోసా (4 ఎకరాల లోపు రైతులు) మండలాల వారీ విశ్లేషణ ఇలా ఉంది.

అన్నపురెడ్డిపల్లి

మొత్తం రైతులు : 5,142

నాలుగు ఎకరాలు లబ్ధి దారులు :  3,613

జమైన మొత్తం : 3,13,33,850

అశ్వారావుపేట

మొత్తం రైతులు : 13,944

నాలుగు ఎకరాలు లోపు లబ్ధిదారులు : 7,194

జమైన మొత్తం: 6,68,65,614

చంద్రుగొండ

మొత్తం రైతులు: 6,331

నాలుగు ఎకరాలు లోపు లబ్ధిదారులు: 4,718

జమైన మొత్తం: 3,97,79,767

దమ్మపేట

మొత్తం రైతులు: 12,323

నాలుగు ఎకరాలు లోపు లబ్ధిదారులు: 6,714

జమైన మొత్తం: 6,01,48,853

ములకలపల్లి

మొత్తం రైతులు: 11,098

నాలుగు ఎకరాలు లోపు లబ్ధిదారులు: 6,476

జమైన మొత్తం: 6,07,19,626

నియోజకవర్గం లో మొత్తం : 48,838

నాలుగు ఎకరాలు లోపు లబ్ధిదారులు: 28,715

జమైన మొత్తం: 25,88,47,710

విశ్లేషణ..

అశ్వారావుపేట మండలంలో అత్యధికంగా 7,194 మంది రైతులు రైతు భరోసా పొందగా, రూ.6.69 కోట్లు జమయ్యాయి.

దమ్మపేట లో 6,714 మంది రైతులకు రూ.6.01 కోట్లు అందాయి.

ములకలపల్లి లో 6,476 మంది రైతులకు రూ.6.07 కోట్లు జమయ్యాయి. దమ్మపేట కంటే లబ్ధిదారులు కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ, జమ చేసిన మొత్తం కొద్దిగా ఎక్కువగా ఉంది.

చండ్రుగొండ లో 4,718 మంది రైతులకు రూ.3.98 కోట్లు అందాయి.

అన్నపురెడ్డిపల్లి లో అత్యల్పంగా 3,613 మంది రైతులకు రూ.3.13 కోట్లు జమయ్యాయి.

నియోజకవర్గం మొత్తంగా 48,838 మంది రైతుల్లో 28,715 మంది (సుమారు 59%) నాలుగు ఎకరాల లోపు రైతులు ఈ విడతలో లబ్ధి పొందారు. వారి ఖాతాల్లో మొత్తం రూ.25.88 కోట్లు జమయ్యాయి. ఇది చిన్న, సన్నకారు రైతులకే ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం విడతలవారీగా నిధులు విడుదల చేస్తోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -