Thursday, July 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ పంప్ హౌజ్ లో హైఓల్టేజ్ విద్యుత్ సరఫరా

కొయ్యుర్ పంప్ హౌజ్ లో హైఓల్టేజ్ విద్యుత్ సరఫరా

- Advertisement -

రెండు రోజులుగా నిలిసిన మిషన్ భగీరథ నీరు
అల్లాడుతున్న ప్రజలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలం కొయ్యుర్ లోని మిషన్ భగీరథ పంప్ హౌజ్ లో హైఓల్టేజ్ విద్యుత్ సరఫరా కావడంతో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలసిపోయింది. దీంతో తాడిచెర్ల, పెద్దతూండ్ల, మల్లారం, దుబ్బపేట, చిన్నతూండ్ల, అడ్వాలపల్లి, గాదంపల్లి, కిషన్రావు పల్లి గ్రామాల ప్రజలు తాగునీటి కోసం గత రెండు రోజులుగా అల్లాడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు పంప్ హౌజ్ లో విద్యుత్ సరఫరాసై పరిశీలించాలని మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. విద్యుత్ సరఫరా సాపిగా జరగక, హైఓల్టేజ్ ఉన్నప్పుడు మోటార్స్ ఆన్ చేస్తే మోటార్స్ ఖాలిపోయే ప్రమాదం ఉంటుందని మిషన్ భగీరత సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోని విద్యుత్ సరఫరాను పరిశీలించాలని ప్రజలు కోరారు. ఈ విషయమై గ్రిడ్ ఏఈని వివరణ కోరగా విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకపోయి రెండు రోజులుగా చెబుతున్నాం. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు సమస్యను పరిస్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -