నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పెద్ద ఎడిగి గ్రామ పంచాయతీకి చెందిన పరిశుద్ధ కార్మికుడు పెంటయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందడం పట్ల గ్రామ సర్పంచ్ అస్పత్వర్ అనిల్ కుమార్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సందర్భంగా గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత, గ్రామ అభివృద్ధి కోసం పెంటయ్య అహర్నిశలు కష్టపడి గ్రామానికి అందించిన సేవలు చిరస్మరణీయమని సర్పంచ్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ క్లిష్ట సమయంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అంత్యక్రియల నిర్వహణకు తన వంతు సహాయంగా రూ.10,000/- ఆర్థిక సహాయాన్ని సర్పంచ్ అస్పత్వర్ అనిల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ పెంటయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీరని దుఃఖాన్ని భరించే మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.



