Friday, July 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనుమతులు లేని రెండు అక్రమ వెంచర్ల నిర్మాణాలు కూల్చివేత

అనుమతులు లేని రెండు అక్రమ వెంచర్ల నిర్మాణాలు కూల్చివేత

- Advertisement -

– మరో రెండు వెంచర్లపైనా చర్యలు తప్పవన్న మున్సిపల్ కమిషనర్
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏడో వార్డు వికాస్‌నగర్ కాలనీలో అనుమతులు లేకుండా అభివృద్ధి చేస్తున్న రెండు అక్రమ వెంచర్లలో చేపట్టిన నిర్మాణాలను మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో సర్వే నంబర్లు 672, 675, 676, 677, 678లో అభివృద్ధి చేస్తున్న ఈ వెంచర్లకు ప్రభుత్వం, మున్సిపాలిటీ లేదా డీటీసీపీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు.

కూల్చివేత కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ పర్వతాలు పర్యవేక్షించగా, టౌన్ ప్లానింగ్ అధికారి వినీత్, మున్సిపల్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పర్వతాలు మాట్లాడుతూ, సంబంధిత వెంచర్లకు డీటీసీపీతో పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. నిర్మాణాలు నిలిపివేయాలని ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్వాహకులు స్పందించకపోవడంతో కూల్చివేత చర్యలు చేపట్టాల్సి వచ్చిందన్నారు. మరో రెండు అక్రమ వెంచర్లపైనా త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్లు ఆయన హెచ్చరించారు. ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసే ముందు సంబంధిత వెంచర్‌కు ప్రభుత్వం, డీటీసీపీ నుంచి తుది అనుమతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకుని మాత్రమే పెట్టుబడులు పెట్టాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -