నవతెలంగాణ-కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డు ఎన్జీవోస్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత అంగన్వాడీ చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 3 నుంచి 6 ఏళ్ల వయస్సు గల అంగన్వాడీ చిన్నారులకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫాంలు అందించడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తోందన్నారు. ప్రతి చిన్నారి విద్యాభ్యాసానికి అవసరమైన ప్రోత్సాహం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు సబ్బని కృష్ణహరి, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, స్థానికులు లక్ష్మినారాయణ, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ చిన్నారులకు ఉచిత యూనిఫాంల పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



