నవతెలంగాణ-జుక్కల్ : మండలంలోని చిన్న ఎడ్గీ జిపి గ్రామంలో ఫ్రేడే- డ్రైడేను శుక్రవారంనాడు జుక్కల్ ఎంపీ ఓ రాము పరిశీలించారని జిపి కార్యదర్శి రాములు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో మీ అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు పట్టికను తీసుకొని హాజరు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బాధితులకు గర్భిణీలకు పౌష్టికాహారం అందుతున్నాయా అని అడిగే తెలుసుకున్నారు. గుడ్లు, పాలు నిత్యం ఇస్తున్నారా లేదా అని అడిగి గర్భిణీలకు బాలింతలకు అడిగినారు. అదేవిధంగా వర్షాకాలంలో ఎక్కడ కూడా గ్రామం లో మీరు నిలవకుండా వెంట వెంటనే చర్యలు తీసుకొని , శానిటేషన్ పనులు త్వరగా పూర్తిచేసి గుంతలను పూరించి వేయాలని జిపి కార్యదర్శిని ఆదేశించారు. గ్రామాలలో పరిశుభ్రత పాటించాలని జత జిగారం పేరుకుపోకుండా చూడాలని అన్నారు. రీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనంతరం కంపోస్ట్ షెడ్ , త్రాగునీటి నల్లాల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపి ఓ రాముతో పాటు జిపి కార్యదర్శి రాములు, అంగన్వాడీ టీచర్ చంద్రకళ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
చిన్న ఏడ్గి జీపీ గ్రామంలో ఫ్రైడే- ఫ్రైడే పరిశీలించిన ఎంపీ ఓ రాము
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



