నవతెలంగాణ-బెజ్జంకి : ఓటు కీలకమైందని..ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు.శుక్రవారం మండల పరిధిలోని గుగ్గీళ్ల గ్రామంలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను ఎమ్మెల్యే కవ్వంపల్లి కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జీ కూన శ్రీశైలంతో కలిసి పరిశీలించారు.ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,తహసీల్దార్ శ్రీకాంత్,ఎంపీడీఓ ప్రవీన్,మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన..
మండల పరిధిలోని తోటపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు గుంటి సుజాత ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ శంకుస్థాపన చేశారు.త్వరితగతిన ఇళ్లు నిర్మాణం చేపట్టి సొంతింటికల సాకారం చేసుకోవాలని లబ్ధిదారురాలుకు దామోదర్ సూచించారు.సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్,నాయకులు రత్నాకర్ రెడ్డి,బైరి సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ..
మండల కేంద్రానికి చెందిన జంగిటి రాజయ్య ఇటీవల మృతి చెందారు.మండల కాంగ్రెస్ నాయకులు ఒగ్గు దామోదర్,లింగాల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,వార్డు సభ్యులు బోనగం రమేశ్,ఎలిగే సతీశ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.



