నవతెలంగాణ-హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమైన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు … రొళ్ల మండలం హెచ్.టి హళ్లి వడ్రహట్టి గ్రామానికి చెందిన వీరేశ్ తాపీ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి సుబ్బమ్మ, భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు రోహిణి, రచనతో కలిసి నివాసముంటున్నాడు. మద్యానికి బానిసైన వీరేశ్.. భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 27న ఇంట్లో మరోసారి గొడవ జరిగింది. అదేరోజు రాత్రి ఇంటి నుంచి సుబ్బమ్మ, లక్ష్మి, రోహిణి, రచన బయటకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి బంధువులు వెతుకుతున్నా వారి ఆచూకీ లభించలేదు. దీంతో మార్చి 1 న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గౌతమి తెలిపారు. వీరేశ్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.
ఒకే కుటుంబంలో నలుగురు ఆదృశ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



