ఎక్కువ మంది ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కల గురించి మీకు తెలుసా..? మీతోనే ఎక్కువగా కలిసి తిరిగే కుక్కలు మీరు చూసే ప్రపంచాన్ని భిన్నంగా చూస్తాయన్న విషయం తెలుసా..? మనందరం ఉదయం లేచిన దగ్గర నుంచి రంగురంగుల ప్రపంచాన్ని చూస్తుంటాం. నీలాకాశం, నారింజ రంగులో సూర్యోదయం, ఆకుపచ్చని చెట్లు ఇలా మన చుట్టూ ప్రకతి అనేక రంగుల్లో కనిపిస్తుంది. కానీ కుక్కలు వీటిలో కొన్ని రంగులను చూడటంలో తేడాలుంటాయి. అంతేకాదు మనుషుల్లా రంగులను స్పష్టంగా అవి చూడలేవనీ, కేవలం నలుపు, తెలుపును మాత్రమే చూస్తాయని అంటారు. అయితే దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. సైన్స్ ఏం చెబుతుందంటే? : నిజానికి కుక్కలు డైక్రోమాట్స్. అంటే, శునకాలు అతితక్కువ, నిర్దిష్ట రంగుల పరిధిని మాత్రమే హించగలుగుతాయి.
కాబట్టి వాటి చూపు మన చూపుకు కొంత తేడా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా రంగులను గుర్తించడానికి కళ్లలో ‘కోన్స్’ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. ఈ కోన్ కణాలు మనుషుల కళ్లలో మూడు రకాలుగా ఉంటాయి. అవి ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు రంగులతో కూడిన ఇంద్రధనుస్సును పూర్తిగా చూడటానికి వీలును కల్పిస్తాయి. అదే, కుక్కల విషయానికొస్తే వాటి కళ్లలో రెండు రకాల కోన్ కణాలు మాత్రమే ఉంటాయని సైన్స్ చెబుతోంది. అవి నీలం, పసుపు రంగులకు సంబంధించినవిగా ఉంటాయి. అందుకే కుక్కల దష్టిశక్తి ఎరుపు, ఆకుపచ్చ వర్ణాంధత్వం (కలర్ బ్లైండ్‌నెస్) కలిగిన మానవుడి చూపును పోలి ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి ఎరుపు, నారింజ, ఆకుపచ్చ రంగుల మధ్య తేడాను గుర్తించడం కుక్కలకు కష్టం. ఏ ఏ రంగులు చూస్తాయంటే? : కుక్కల ప్రపంచంలో ‘నీలం, పసుపు’ అత్యంత ప్రకాశవంతమైన కలర్స్. వీటి కళ్లలో నీలం, పసుపు అనే రెండు రకాల కోన్స్ ఉండడమే అందుకు ముఖ్యమైన కారణం. కాబట్టి కుక్కలు ఈ రెండు రంగులనే స్పష్టంగా చూడగలవని సైన్స్ చెబుతోంది.
అందుకే కుక్కలకు సంబంధించిన అనేక రకాల పరికరాలు, బొమ్మలను నీలం, పసుపు రంగుల్లోనే ఎక్కువగా తయారు చేస్తుంటారని చెబుతున్నారు నిపుణులు. చీకటిలో వేగవంతమైన కదలికలను పసిగట్టే సామర్థ్యం కూడా కుక్కలల్లో ఉంటుంది. అలాగే కుక్కలు వేటి మధ్య అయినా తేడాల్ని గుర్తించేందుకు తమకు ఉన్న ప్రత్యేక వాసన శక్తిపైనే ఆధారపడతాయి. మరి, శునకాల గురించి ఇన్ని విశేషాలు తెలుసుకున్నారు కదా! మీరేం చేస్తారంటే మీ ఇంట్లో ఉండే కుక్కల ముందు రకరకాల రంగుల్లో ఉండే ఆట వస్తువులను, విభిన్న ఆకతుల్లో ఉండే పరికరాలను ఉంచి ఓసారి పరిశీలించండి. అలాగే దూరాల్ని, ఆకతుల్ని గుర్తించగలుతున్నాయా పరీక్షించండని సలహా ఇస్తున్నారు నిపుణులు. తద్వారా కుక్కలు ఏ ఏ కలర్స్ స్పష్టంగా చూస్తున్నాయో మీకూ ఒక అవగాహన వస్తుందని చెబుతున్నారు.
కుక్కలు అన్ని రంగులూ చూడగలవా?
- Advertisement -
- Advertisement -



