Sunday, July 5, 2026
E-PAPER

అంతం

- Advertisement -

గాలికి ఊగుతున్న చెట్టే గాలి వీస్తుంది
ఎగిసి పడుతున్న అలే సముద్రానికి సంకెళ్లు
వేస్తుంది కప్పను మింగిన పామునే గ్రద్ధ చీల్చుకు తింటుంది
కంటికి కనిపించని పలుకుల్ని అమతభాండల్లా
తలకెత్తుకుని భూగర్భంలో మహాసామ్రాజ్యాలకు
సాగిపోతుంటారు చీమసైనికులు
ఇంతలో మనిషి అడుగు పెట్టేడు..!
విజ్ఞానాన్ని మోసుకొచ్చేడు
చెట్టు ఉపయోగాలు వర్ణించేడు
పర్యవసానాలు వినకుండా నేలకూల్చాడు
అవయవాలు అమ్మి సొమ్ము చేసుకొన్నాడు
సముద్రంలో సహజ వాయువు ఆయిల్‌
నిక్షేపాలు పిండేసి, సునామీల సుడిగుండంలా
మార్చేశాడు
ఒకదాన్ని మరోటి తింటూ గుట్టుగా బతికే
జీవుల్ని తినేసాడు!
చెట్టూ లేదు పుట్ట లేదు
చీమ లేదు పురుగూ లేదు
గాలీ లేదు సముద్రం లేదు
దేనికీ ప్రాధాన్యత లేదు!?
మనిషోక్కడే..
లెక్కకు మించిన అవసరాలతో
వికటాట్టహాసంతో నిలబడ్డాడు
అమతతుల్యమైన మట్టిని విషతుల్యం చేసి
ప్రకతిని మతకళేబరం చేశాడు
నేలంతా మనుషులే వారి విలాస కట్టడాలే
అవసరాలు తీర్చే పరిశ్రమలే
అహం తీర్చే ఆయుధాలే
ఆయుధాల కోసం యుద్ధం పుట్టింది!
రక్తం ఏరులై పారి నాశనం తలకెక్కింది
కనుచూపు మేరలో మనిషి అంతం కనిపిస్తుంది
కొస ఊపిరి ప్రకతి జాలిగా నవ్వుతోంది..!

– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -