Sunday, July 5, 2026
E-PAPER
Homeసోపతిజీవితం ఆశ-నిరాశల సంగమం

జీవితం ఆశ-నిరాశల సంగమం

- Advertisement -

ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం,
ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం.
కన్నీటి కెరటాలు కళ్లను కమ్ముకున్నా,
కాలమే కఠినంగా గుండెను చిదిమేసినా
చీకటి చాటున చితికిపోయిన కలలైనా,
చివరికి చిగురించే చినుకై మారుతుంది చిన్ని ఆశతో.
పడిపోవడం పరాజయం కాదు,
పట్టుదల విడిచిపెట్టడమే ఆత్మహననం.
విరిగిన రెక్కలతోనైనా విహరించాలనే తపనే విజయం,
వేదనను వెలుగుగా మలచుకోవడమే జీవితం.
నిరాశ నిప్పుల మధ్య ఆశ అంకురిస్తుంది,
నిస్పహ నిట్టూర్పుల వెనుక విజయం చిగురిస్తుంది.
జీవితం అంటే ఆశల అలలు, నిరాశల తుఫానులు,
అయినా ముందుకు నడిపించేది మనసులోని ధైర్యం.
ఆశ ఆరిపోని అఖండ దీపమైతే,
నిరాశ ఆ దీపానికి ఎదురయ్యే సుడిగాలి
పోరాడే ప్రతి ఉచ్ఛ్వాసనిశ్వాసే అంతిమ విజయ గీతిక,
అందుకే జీవితం… ఆశను ఆరాధించే,
నిరాశను అధిగమించే పవిత్ర సంగమం.

కోట దామోదర్‌, 9391480475

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -