- Advertisement -
నా బలం నువ్వే
నా బలహీనత నువ్వే
నా ధ్యాస నువ్వే
నా శ్వాస నువ్వే
మదిలో ఎప్పుడు నీ తలపులే
ఈ తరగని తలపులకు తలుపులు వేయలేని అసహాయత
ఎందుకంటే నీ తలపులలోనే జీవిస్తున్న
అనుక్షణం నీ కోసం నిరీక్షిస్తున్న.
– పాలపర్తి సంధ్యారాణి
- Advertisement -



