- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో క్షేత్ర స్థాయి నుంచి రగ్బీ క్రీడను అభివృద్ది చేసేందుకు సమగ్ర కార్యాచరణతో రోడ్‌మ్యాప్ రూపొందిచనట్టు రగ్బీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు నరేంద్ర రామ్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఆ సంఘం ఏజీఎంలో జిల్లా సంఘాల ప్రతినిధులతో విడిగా సమావేశమైన నరేంద్ర రామ్.. జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు సహా పాఠశాలలు, కళాశాలల్లో టోర్నమెంట్ల నిర్వహణపై చర్చించారు. తెలంగాణలో రగ్బీ అభివృద్ది, అవకాశాల కల్పనపై రూపొందించిన వార్షిక ప్రణాళికను ఏజీఎంలో ఆవిష్కరించారు.
- Advertisement -



