Monday, July 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఖమేనీ అంత్యక్రియలకు రావద్దు

ఖమేనీ అంత్యక్రియలకు రావద్దు

- Advertisement -

మొజ్తాబాకు సూచించిన ఐఆర్‌జీసీ
టెహ్రాన్
: దివంగత నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావద్దని సుప్రీం నేత మొజ్తాబాకు ఇరాన్ ఐఆర్‌జీసీ సూచించింది. మొజ్తాబా ప్రజల మధ్యకు వస్తే ఇజ్రాయిల్ సేనలు ఆయనను హతమార్చే అవకాశం ఉన్నదని లేదా ఆయన ఎక్కడ ఉన్నదీ తెలుసుకుంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా అంత్యక్రియలకు హాజరు కావద్దని చెప్పింది. ఈ నెల 9న మషాద్‌లో జరిగే ఖనన కార్యక్రమానికి హాజరయ్యేందుకు తనను అనుమతించాలంటూ ఐఆర్‌జీసీని మొజ్తాబా కోరారు. అయితే ఆయన అభ్యర్థనను రివల్యూషనరీ గార్డులు తోసిపుచ్చారు. అమెరికా-ఇజ్రాయిల్ దాడిలో మొజ్తాబా భార్య కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమె సంస్మరణార్థం టెహ్రాన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కూడా మొజ్తాబా హాజరు కాలేదు. దీంతో ఆయన ఆరోగ్యం పైన, ఎక్కడ ఉన్నారనే దాని పైన ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -