- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే దంపతులు సోమవారం మూడు రాష్ట్రాల సరిహద్దులోని మద్నూర్ మండలం సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యే దంపతులను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, సలాబత్పూర్ గ్రామ సర్పంచ్ దిగంబర్, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, ఆలయ అధికారి వేణు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



