న్యూజెర్సీ (యుఎస్‌ఏ) : ఫిఫా ప్రపంచకప్ మాజీ చాంపియన్, అగ్రజట్టు బ్రెజిల్‌కు మళ్లీ భంగపాటు తప్పలేదు. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్లో నార్వే చేతిలో 1-2తో బ్రెజిల్ పరాజయం పాలైంది. ఆట మొదలైన 78 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ కొట్టలేదు. నార్వే ఆటగాడు ఎర్లింగ్ హాలాండ్ 79వ నిమిషంలో గోల్ కొట్టి ఖాతా తెరిచాడు. 90వ నిమిషంలో మరో గోల్‌తో నార్వేను 2-0తో ముందంజలో నిలిపాడు. 90+10వ నిమిషంలో గోల్ కొట్టిన బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్ జూనియర్ 1-2తో ఆధిక్యం తగ్గించాడు. బ్రెజిల్‌పై మెరుపు విజయంతో నార్వే క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లాండ్ సైతం క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. మెక్సికో సిటీలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు మెక్సికోపై 3-2తో ఇంగ్లాండ్ గెలుపొందింది. జులియన్ (42వ నిమిషం), రాల్ (69వ నిమిషం) మెక్సికోకు గోల్స్ అందించారు. హ్యారీ కేన్ 60వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలచగా.. జూడ్ బెల్లింగ్‌హామ్ 36, 38వ నిమిషాల్లో గోల్స్ కొట్టాడు.



