Tuesday, July 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీఎం కిసాన్ కొందరికేనా.?

పీఎం కిసాన్ కొందరికేనా.?

- Advertisement -

మండల వ్యాప్తంగా రైతులు 9400
ప్రయోజనం చేకూరేది 2351 వేల మందికే
ఏడేళ్లుగా కొత్త రైతుల ఎదురుచూపు
నవతెలంగాణ – మల్హర్ రావు

పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మండలంలో కొంతమందికే ప్రయోజనం చేకూరుతొంది. 2019 జనవరి 31 వరకు పట్టాదారు పసుపుస్తకాలు పొందిన చిన్న, సన్న కారు రైతులకు మాత్రమే ఏటా మూడు విడతల్లో కలిపి రూ.6 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఆ తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారికి ఈ పథకంలో చేరడానికి అవకాశం లేకుండా పోయింది. వారిలో మృతిచెందిన రైతుల పేర్లను తొలగిస్తున్నారు.కానీ కొత్త వారి పేర్లు నమోదు చేయకపోవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద అందరూ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు.అలాగే కొత్త రైతులకు అవకాశం కల్పిస్తున్నారు. కేంద్ర పథకంలో ప్రస్తుతం అవకాశం లేక ఎందరో రైతులు ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నారు.

25 శాతానికే పరిమితం..
మండలంలో ఏటేటా రైతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఈ ఏడాది వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ప్రకారం మండలంలో  9400 వేల రైతులు ఉండగా,పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కేవలం 2351 వేల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించారు.ఈ లెక్కన ఇంకా 7049 వేల మందికి నిధులు అందడంలేదు.అంటే ఇంకా సగానికి పైగా రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరడం లేదు.మొత్తం మీద 25 శాతం రైతులకు మాత్రమే ఈ పథకం వస్తోంది.

ప్రస్తుతం అవకాశం లేదు: ఏవో శ్రీజ
ఈ పథకాన్ని 2019లో ప్రారంభించగా అప్పట్లో మండలంలో 2351 వేల మంది రైతులను గుర్తించారు. కొంతమంది చనిపోగా మిగతవారికి పిఎం కిసాన్ సమ్మాన్ నిది డబ్బులు ఖాతాల్లో జమవుతున్నాయి. కొత్త రైతుల పేర్లు నమోదు చేయాలనే ఆదేశాలు ఇంకా రాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -