- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
3-5 ఏళ్ల పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీలకు పంపాలని తిమ్మాపూర్ సర్పంచి గుడ్లావత్ సంగీత, అంగన్వాడి టీచర్ జాడి సంజీవరాణి సూచించారు. బుధవారం తిమ్మాపూర్ అంగన్వాడీ కేంద్రం-1లో గర్భిణులు, బాలింతలకు బాలామృతం, గుడ్లు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే ఈ ఆహారం ఎంతో బలవర్ధకమైనదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాజు, ఆశా కార్యకర్త రజిత ఆయా గుండ మమత గర్భిణీలు బాలింతలు చిన్నారులు
తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



