నవతెలంగాణ-పెబ్బేరు
దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను పెబ్బేరు పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సుభాష్ చౌరస్తాలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. వైఎస్ ప్రవేశపెట్టిన 108, 104, పేద విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను కొనియాడారు. ప్రజలకు మేలు చేసిన ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి,మున్సిపల్, మార్కెట్ వైస్ చైర్మన్లు విజయ్ వర్ధన్ రెడ్డి, సుమిత్రమ్మ, మండల అధ్యక్షులు రాంరెడ్డి, టౌన్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి తో పాటు నాయకులు వెంకటేష్ సాగర్, రంజిత్ కుమార్, సురేందర్ గౌడ్, సర్పంచ్ లు అశోక్, దండు పద్మ అర్జున్, మాజీ కౌన్సిలర్లు శివసాయి, తాటికొండ కృష్ణ, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



