Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి

ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి

- Advertisement -

మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి 
నవతెలంగాణ – రామారెడ్డి 

ప్రభుత్వం సర్ ప్రక్రియ సజావుగా నడిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మండల ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం నియమించిన బి ఎల్ వోలు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. ఓటు హక్కు ఉండి, అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరుకు ఎస్ ఐ ఆర్ ఫారం అందేలా బి ఎల్ వోలు కృషి చేయాలని సూచించారు. ఓటర్లు తమ ఫారాలను వ్రాసి సంబంధిత బి ఎల్ వో లకు అందించాలని సూచించారు. ప్రక్రియలో పాల్గొనకపోతే ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఉందని సూచించారు. ఒక ఓటరుకు ఒకే చోట ఓటు హక్కు ఉండేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి రాజా గౌడ్,, నాయకులు ప్రభాకర్ రావు, కిషోర్, హనుమాన్లు, కుక్కల రాజు, కంచం రాజు, ఆసరి కిషన్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -