నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్కంఠభరితంగా సాగినా సెకండ్ సెమీ పోరులో టీమిండియా అద్భుత విజయం సాధించింది.7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా జరిగే తుది పోరులో న్యూజిలాండ్ జట్టుతో టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకోనుంది.
తొలుత బ్యాటింగ్ దిగిన టీమిండియా 20 ఓవర్లగాను ఏడు వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. సంజు(89) అభిషేక్(9) ఇషాన్(39), దూబే(43), సూర్య(11), తిలక్(21), పాండ్యా(27) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లు జాక్స్, రషీద్ తలో రెండు వికెట్లు తీయగా ఆర్చర్ ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత చేధనకు దిగిన ఇంగ్లాండ్ బెతల్ సెంచరీతో చెలరేగిన నిర్ణీత ఓవర్లో ఇండియా నిర్ధీశించిన టార్గెట్(253)ను చేధించలేకపోయింది. దూబె వేసిన చివరి ఓవర్లో బెతల్ రనౌట్ కాగా 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం లాంఛనమైంది. అయితే చివరలో ఆర్చర్ భారీ సిక్స్‌లు కొట్టినా గెలుపు అంతరం తగ్గించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 246 పరుగులు చేసి విజయానికి కావాల్సిన 7 పరుగుల తేడాతో పోరాడి ఓడిపోయింది. ఇండియా బౌలర్ల పాండ్యా రెండు వికెట్లు తీయగా, బుమ్రా, ఆర్షదీప్, వరుణ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు. బ్యాక్ టూ బ్యాక్ అర్ధ సెంచరీలతో సంజుకు మ్యాన్ ద మ్యాచ్ లభించింది.



