- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాన్‌సూన్ ప్రభావంతో హైదరాబాద్‌లో చల్లటి, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే చిరుజల్లులు కురవడంతో నగరం మొత్తం పొగమంచు కమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వాతావరణం నగరవాసులను ఆకట్టుకుంటున్నప్పటికీ, ఉదయాన్నే పనులకు వెళ్లేవారు, పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం స్టార్ట్ అయ్యిందని, మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిది.
- Advertisement -



