- Advertisement -
పీసీసీ చీఫ్‌నకు మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కడియం శ్రీహరి పై పార్టీ పరం గా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లో పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యారు. మహిళా మంత్రినైన తనను టార్గెట్ చేస్తూ జిల్లా రాజకీయాల్లో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇదే విషయమై బుధవారం సీఎంకు మంత్రి హోదాలో ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. మహేశ్‌కుమార్ గౌడ్ స్పందిస్తూ ఇరువురి మధ్య వివాదాన్ని పరిష్కరిస్తానని హామీనిచ్చారు.
- Advertisement -


