Friday, July 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

- Advertisement -

జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్
నూతనకల్‌ ‌మండలంలో సాగిన స్ఫూర్తి యాత్ర


నవతెలంగాణ- నూతనకల్
గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వారి అసమాన త్యాగాలు మరువలేనివని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ అన్నారు. జనగామ జిల్లా కడివెండి గ్రామంలోని తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్మారక స్థూపం నుంచి ప్రారంభమైన అమరవీరుల యాదిలో స్ఫూర్తి యాత్ర గురువారం సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలానికి చేరుకుంది. వెంకెపల్లి గ్రామంలో బాత్క రాజమల్లు, మండల కేంద్రానికి చెందిన బయ్య కొమరయ్య కుటుంబాలను యాత్ర నాయకులు పరామర్శించారు. అమరవీరుల చిత్రపటా‌లకు పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్మారక సభలో రవీందర్‌ మాట్లాడుతూ.. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఏర్పడి 30 ఏండ్లు అవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో నేటి వరకు ఉద్యమంలో పనిచేసి అమరులైన వారి కుటుంబీకులను కలిసి ఆ పోరాట యోధులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా 40 కుటుంబాలను కలుస్తున్నామని తెలిపారు.

అనేకమంది పోరాట యోధులు సంఘం కోసం, గొర్రెల మేకల పెంపకం దారుల హక్కుల కోసం ఉద్యమాలు చేశారన్నారు. 559, 1016 వంటి జీవోలను సాధించిన చరిత్ర జీఎంపీఎస్‌‌కు దక్కిందన్నారు. చనిపోయిన గొర్రెల కాపరులకు బీమా అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్, రాష్ట్ర నాయకులు చల్ల మల్లయ్య, జల్లెల్ల పెంటయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కడెం లింగయ్య, ఉప్పుల రమేష్, జిల్లా నాయకులు మట్టిపల్లి సైదులు, వజ్జా వినయ్ యాదవ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బత్తుల జనార్దన్, రైతు సంఘం మండల అధ్యక్షులు చూడి మధుసూదన్ రెడ్డి, జటంగి లింగయ్య, బాత్క పెద్ద వెంకన్న, భయ్యా రవీందర్, పూలమ్మ, సోమేశ్వరి, వజ్జా సాయి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -