ఐఐఓపీర్ సంస్థ ప్రధాన
శాస్త్రవేత్త డాక్టర్ రాంచంద్రుడు
కొదురుపాకలో రైతు భూమిలో
మెగా ప్లాంటేషన్
నవతెలంగాణ – సుల్తానాబాద్
ఆయిల్ ఫామ్ దీర్ఘకాలిక పంటని ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దవేగి ఏలూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ ఆయిల్ పామ్ రీసర్చ్ (iiopr ) సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంచంద్రుడు తెలిపారు. నాటిన మూడో సంవత్సరం నుంచి పంట చేతికి వస్తుందని వివరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాక గ్రామ రైతు దేవవారనేని రాజేశ్వర్‌రావు వ్యవసాయ aభూమిలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గురువారం మెగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఆ రైతుకున్న 20 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త రాంచంద్రుడు మాట్లాడుతూ.. సరైన నీటి యాజమాన్యం, ఎరువుల పద్ధతి పాటిస్తే అయిల్‌పామ్‌లో ఘననీయమైన దిగుబడులు వస్తాయన్నారు. నీటి వసతి వున్న రైతులు ఆయిల్ పామ్ వైపు ముందుకు రావాలని చూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నకల్వల ఫాక్స్ చైర్మెన్ దేవరానేని మోహన్‌రావు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్, తిరుమల ఆయిల్ పామ్ సీఈఓ కేషు కల్యాంకర్, ఉద్యాన అధికారులు సుంకే మహేష్, ఉద్యాన విస్తరణ అధికారులు మహేష్, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీధర్ పాల్గొన్నారు.


