– ద్రవ్యోల్బణానికి ఆజ్యం
– ఉద్రిక్తతలపై మూడీస్ హెచ్చరిక..
న్యూఢిల్లీ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌లు దురాంకారంగా సాగిస్తోన్న యుద్ధంతో భారత్‌లో ద్రవ్యోల్బణం ఎగిసిపడనుందని అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ మూడీస్ హెచ్చరించింది. పశ్చిమా సియాలో ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల వల్ల రూపాయి విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణం పెరగడం, కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) పెరగడం వంటి సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. భారత్ తన ముడి చమురు, సహజ వాయువు అవసరాల కోసం సుమారు 46 శాతం మధ్యప్రాచ్య దేశాలపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో సరఫరాకు అంతరాయం కలిగితే అది దేశీయ ఆర్థిక నిర్వహణను క్లిష్టతరం చేస్తుందని మూడీస్ విశ్లేషించింది. ఒకవేళ ఈ అనిశ్చితి మరికొన్ని వారాల పాటు కొనసాగితే, బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటే అవకాశం ఉందని, దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని మూడీస్ హెచ్చరించింది. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే మాత్రం ప్రభుత్వ రాయితీలు పెరిగి బడ్జెట్ అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం ఉందని మూడీస్ అంచనా వేసింది.
భారత ఆర్థిక వ్యవస్థకు ముప్పు
- Advertisement -
- Advertisement -



