నవతెలంగాణ – పరకాల
గ్రామ యాదవ కుల సంఘం నూతన కార్యవర్గాన్ని గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐదు సంవత్సరాల కాలపరిమితితో చేపట్టిన ఈ ఎన్నికల్లో భాగంగా, సంఘం నూతన అధ్యక్షుడిగా బత్తిని చిన్న తిరుపతిని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా బొంతల రవి, ప్రధాన కార్యదర్శిగా బొంతల కనకమల్లు, కార్యదర్శిగా కన్నెపిల్ల రమేష్‌లను నియమించారు. అలాగే, కార్యవర్గ సభ్యులుగా బొంతల నాగరాజు, కొడారి మహేష్, బొంతల శ్రీను, పెరుగు చందు, గొల్ల చిన్న కుమార్ స్వామి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బత్తిని చిన్న తిరుపతి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న కుల పెద్దలకు, సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘం బలోపేతానికి, కులస్తుల సంక్షేమానికి అందరి సహకారంతో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పెద్దలు, గ్రామస్తులు మరియు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యాదవ సంఘం నూతన కార్యవర్గ ఏకగ్రీవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



