నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహాన్ని సంవత్సరం క్రితం పురాతనమైనందున అధికారులు కూల్చేశారు. కూల్చడానికి రూ.5 లక్షల నిధులు స్పెషల్ ఫండ్ వచ్చినా.. నూతన భవనం నిర్మాణ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం వసతి గృహం లేనందున బాలికలను తాత్కాలికంగా మండల కేంద్రంలోని ఎస్సీ, ఏ బాలుర వసతి గృహానికి మార్చారు. అక్కడున్న హాస్టల్ విద్యార్థులకు మండల కేంద్రంలోని ఎస్సీ స్పెషల్ హాస్టల్లో నివాసం కల్పించారు. రెండు రాష్ట్రాల విద్యార్థులు ఒకే చోట ఉన్నందున గదులు సరిపోక ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు వాపోయారు. కూల్చేసిన షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహం స్థానంలో వెంటనే నూతన భవనాన్ని నిర్మించి, పేద విద్యార్థులకు భవితకు బంగారు బాటలు వేయాలని స్థానికులు, విద్యార్థుల తలిదండ్రులు, ఉపాధ్యాయ బృందం ప్రభుత్వాన్ని కోరింది.
నూతన బాలికల వసతి గృహ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



