- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
గురువారం రాత్రి జుక్కల్ మండలం బంగారుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ సర్పంచ్ భర్త బిరదార్ మణిక్రావు పటేల్ కన్నుమూశారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుక్రవారం బంగారుపల్లికి చేరుకుని, మృతుడి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎప్పుడు తాను అండగా ఉంటానని, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా తనవంతు సాయం అందిస్తానని చెప్పారు.
- Advertisement -



