నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కేజీబీవీ గురుకుల హాస్టల్ ను జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇందులో భాగంగా వంటశాల గదిలో భద్రపరిచిన కూరగాయలు, పండ్లు, బియ్యం, నూనే, గుడ్లు, పాలు, పెరుగు, స్నాక్స్ ఇతర తినుబండారాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ..విద్యార్థినిలకు మెనూ ప్రకారమే ఆహారం అందించాలన్నారు. ప్రభుత్వం గురుకులాలకు కల్పించిన ప్రతి ప్రథకం పక్కాగా అమలు కావాలనీ, ప్రతి ముద్ద విద్యార్థినీల నోటికి అందాలన్నారు. ముఖ్యంగా వంటశాలను శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రితిలో ఉపాధ్యాయ బృందం భోదన చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థినిలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారిని హేమలత, అధ్యాపకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీ హాస్టల్ ను సందర్శించిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



