Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
కాటారం మండలం దామరకుంట గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మండల హడక్ కమిటీ అధ్యక్షుడు ఇసునం మహేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కమిటీని ప్రకటించారు. గౌరవ అధ్యక్షులుగా కోడిపెల్లి వెంకటయ్య, కోడిపెల్లి సారయ్యలను ఎంపిక చేయగా, గ్రామ అధ్యక్షుడిగా కోడిపెళ్లి సందన్ నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా తోటపల్లి తిరుపతి, జంగం సందీప్ బాధ్యతలు చేపట్టారు. ప్రధాన కార్యదర్శిగా కనుకుంట్ల సుదర్శన్, కోశాధికారిగా కనుకుంట్ల అంజి, కోడి రమేష్‌లను నియమించారు.

అదేవిధంగా గ్రామ కమిటీ సభ్యులుగా తోటపల్లి శ్రీను, దుర్గం మల్లేష్, అప్పాల సాగర్, అప్పాల రంజిత్, రామ లక్ష్మణ్, కనుకుంట్ల జగన్, తోటపల్లి రమేష్, జిల్లెల్ల అంజి, తోటపల్లి అన్వేష్, కనుకుంట్ల శ్రీహరి, కొండ్ర ఛత్రపతి, అనపర్తి వినేష్, అప్పాల ఉపేందర్‌లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోడిపల్లి బాలయ్య, కోడి బాలయ్య, జిల్లెల్ల శంకర్, జిల్లెల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల హడక్ కమిటీ అధ్యక్షుడు ఇసునం మహేందర్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో కులవివక్ష, అంటరానితనం, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు తొలగిపోయేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అలాగే ఏప్రిల్ 14న జరగనున్న అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -