Friday, July 10, 2026
E-PAPER
Homeవరంగల్మానవ అభివృద్ధికి శాస్త్రవేత్తల త్యాగాలే మూలం: ఎస్‌ఎస్‌ఎఫ్

మానవ అభివృద్ధికి శాస్త్రవేత్తల త్యాగాలే మూలం: ఎస్‌ఎస్‌ఎఫ్

- Advertisement -

నవతెలంగాణ – హనుమకొండ (భీమారం) :- ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త నికోలా టెస్లా జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సైంటిఫిక్ స్టడీ ఫోరం (ఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు చార్వాక, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల సుమన్ మాట్లాడుతూ ఆల్టర్నేటింగ్ కరెంట్ (AC) విద్యుత్ వ్యవస్థ అభివృద్ధిలో నికోలా టెస్లా చేసిన సేవలను వివరించారు. శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా తపన, ప్రశ్నించే స్వభావం సమాజాభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు సైంటిఫిక్ మ్యాజిక్ షో నిర్వహించారు. అందులో ప్రదర్శించిన అంశాల వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమానికి పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలు ఉషారాణి అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు నికోలా టెస్లా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టెస్లా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, విజ్ఞాన శాస్త్రాభిమానులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -